• Om Namo Venkatesaya Book
    50.00

    “ఓం నమో వెంకటేశాయ” – 16,768 లిఖిత గ్రంథం. వివిధ కోరికలకై ‘ఓం నమో వెంకటేశాయ’ అని వ్రాయువారు ముందుగా శ్రీ వేంకటేశ్వరుని యధాశక్తిగా పూజించి తదుపరి వ్రాయుట ప్రారంభించవలెను. ఇంకా ఈ పుస్తకంలో శ్రీ వేంకటేశ్వరుని నామం వ్రాయుటకు ముందు వ్రాసిన తరువాత చదవవలసిన శ్లోకములు, ‘ఓం నమో వెంకటేశాయ’ రాయు భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలు పెట్టేటప్పుడు ఎలా మొదలుపెట్టాలి? శ్రీ వేంకటేశ్వరుని నామం రాయుటకు అనువుగా గీతలను కలిగి ఉన్నది ఈ పుస్తకం. 16,768 లిఖిత గ్రంథం.

  • sri manidweepa varnana Book
    18.00
    sri manidweepa varnana telugu book
    బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. కురవిందమణులచే ప్రకాసించబడుతున్న కిరీటముచే అలంకరించబడినది. అమ్మవారి నుదురు అష్టమినాటి చంద్రునివలె ప్రకాశితూంటుంది. చంద్రునిలోని మచ్చవలె ఆమె ముఖముపై కస్తూరి తిలకం దిద్దుకుని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణములవలె ఉన్నవి. ప్రవాహమునకు కదులుచున్న చేపలవంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుదక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణములుగా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపుతో చేయబడిన అద్దము కంటె అందమైన ఎర్రని చెక్కిళ్ళతో ప్రకాశించుచున్నది. రక్త పగడమును, దొందపండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీమంత్రమునందలి పదునారు బీజాక్షరముల జతవంటి తెల్లని పలువరుస కలిగియున్నది.
    శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకూ వెదజల్లుతుంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూంటుంది. ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు, వంకీలతోనూ అందముగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అఙ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాలకంటే మృదువైన పాదాలు కలిగి ఉన్నది.
    mohan publications

No products were found matching your selection.

Navigation
Close

My Cart

Close

Wishlist

Recently Viewed

Close

Close

Categories